కాచి చల్లార్చిన నీటిని త్రాగండి.. యం. ఎల్. హెచ్. పి. కుమారి

2086చూసినవారు
కాచి చల్లార్చిన నీటిని త్రాగండి.. యం. ఎల్. హెచ్. పి. కుమారి
రాజవొమ్మంగి మండలం అమినాబాద్ పంచాయితీ వణకరాయి గ్రామంలో ప్రభుత్వ సంచార వైద్య శిభిరాన్ని బుధవారం నిర్వహించారు. 30 మందికి యం. ఎల్. హెచ్. పి. కుమారి వైద్య పరీక్షలను చేసి మందులను ఇచ్చారు. వర్షాలు వల్ల ప్రతీ ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని కుమారి సూచించారు. సీజనల్ వ్యాదులు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని, ప్రభుత్వ వైద్య సేవలను పొందాలని సూచించారు. ఏ. ఎన్. యం. లు శేషారత్నం, మల్లేశ్వరి, డి. ఇ. ఓ. శ్రీనివాస్, పైలట్ శివకనకరాజు, అంగన్వాడీ వర్కర్ లోవమ్మ, ఆశ ఉషారాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్