వీఆర్ పురం మండలం చింతరేవుపల్లికి చెందిన శివరాజు (42) సోమవారం పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. పొగాకు బేళ్లు లోడు చేస్తుండగా కుప్పకూలిపోవడంతో తోటి కూలీలు అతన్ని రేఖపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. శివరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.