రంపచోడవరం డిప్యూటీ తహశీల్దార్ షేక్ ఫయాజ్ భాషా (జిలానీ) ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సీహెచ్. బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెవిన్యూ ఉద్యోగులు ఆయనను పూలమాలలతో సన్మానించి అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఫయాజ్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ. సత్యనారాయణ, ఎల్. సునీత, సీహెచ్. నిర్మలకుమారి, వరప్రసాద్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.