రంపచోడవరం మండలం ఊట్ల, రామన్నపాలెం ప్రాంతంలో ఓ ఎద్దుపై పులి దాడి చేసి చంపేసింది. చనిపోయిన ఎద్దును కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిని త్వరగా పట్టుకుని గిరిజనుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.