రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.13 వేల ఆర్థిక సాయం

8చూసినవారు
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.13 వేల ఆర్థిక సాయం
గత నెల 23వ తేదీ రాత్రి గంగవరం మండలం ఏటిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ వాల్మీకి నగర్ కు చెందిన బొంకు దామస్ కుటుంబానికి ప్రైవేట్ వైద్యులు అండగా నిలిచారు. శనివారం జడ్డంగి గ్రామంలో దామస్ నివాసం వద్ద జరిగిన సంస్మరణ కార్యక్రమంలో, డా. లక్కొజు దుర్గబాబు, డా. బొల్లం వెంకటరమణ, డా. పరాత్పరరావు, కె. వెంకటరమణ (మెడికల్ షాప్), డా. శేషగిరిరావు, డా. మొండెం రాజు, పూలపూడి లక్ష్మి తదితరులు దామస్ భార్య బేబీకి రూ. 13వేల నగదు ఆర్థిక సహాయాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్