చింతపల్లి మండలంలోని ఎర్రబొమ్మలు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్సై జీ.వీరబాబు శుక్రవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. వారి వద్ద నుంచి రూ.6,120 స్వాధీనం చేసుకున్నామన్నారు.