స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో రాజవొమ్మంగికి ఐదుగురికి సత్కారం

1చూసినవారు
స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో రాజవొమ్మంగికి ఐదుగురికి సత్కారం
రంపచోడవరం ఐటీడీఏ మీటింగ్ హాల్‌లో శుక్రవారం కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛాంధ్ర అవార్డులు–2026 జిల్లా స్థాయి పురస్కారాల్లో రాజవొమ్మంగి మండలానికి చెందిన ఐదుగురికి అవార్డులు లభించాయి. జడ్డంగి సచివాలయానికి చెందిన ఆర్. కిషోర్, దూసరపాము-3 అంగన్వాడీ కేంద్రం వర్కర్ గూడెం లక్ష్మి, జడ్డంగి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారిణి డా. వి. ప్రమీల, జడ్డంగి సచివాలయం గ్రీన్ అంబాసిడర్ వీరరాఘవులు, రాజవొమ్మంగి బీసీ బాలికల వసతి గృహం వెల్ఫేర్ అధికారిణి పంపనబోయిన దుర్గా భవాని పురస్కారాలను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో రాజవొమ్మంగికి గుర్తింపు లభించింది.

సంబంధిత పోస్ట్