2 వేల కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు

0చూసినవారు
2 వేల కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు
రాజవొమ్మంగి మండలంలో, జడ్డంగి ప్రభుత్వ పశు వైద్యశాల వద్ద , సోమవారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా 2 వేల కుక్కలకు ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజవొమ్మంగి పశువైద్యాధికారి డా. తరుణ్ కుమార్ తెలిపారు. కుక్కలను పెంచుతున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలో ఈ కార్యక్రమం జరగనుంది. 2 వేల ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సంబంధిత పోస్ట్