తుపాన్ ప్రభావంతో జి. కొత్తపల్లిలో విద్యుత్ స్తంభాలు విరిగి, వైర్లు తెగిపోవడంతో ఏర్పడిన విద్యుత్ అంతరాయంపై బుధవారం వచ్చిన వార్తకు విద్యుత్ అధికారులు స్పందించారు. కొండలింగంపర్తి నుంచి జి. కొత్తపల్లి మధ్య గురువారం నూతన విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసి 40 కుటుంబాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు ఇన్చార్జి ఏఈ శివకిరణ్ తెలిపారు. వర్షంలోనూ శ్రమించిన విద్యుత్ సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లైన్మెన్ రాజేష్, జూనియర్ లైన్మెన్లు సత్తిబాబుదొర, శ్రీనివాస్, బీరబోయిన వరప్రసాద్ పాల్గొన్నారు.