రాజవొమ్మంగి మండలంలో గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మండలంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్ని గ్రామాలు కలిపి 82 విగ్రహాలను ఏర్పాటు చేయగా 58 విగ్రహాలు నిమజ్జనం ఆదివారంకు పూర్తి అయ్యాయని ఎస్. ఐ లు వెంకట్రావు, చినబాబు తెలిపారు. జడ్డంగి గ్రామ వారపుసంతలో దోనేలపాలెం గ్రామ వినాయక విగ్రహ ఊరేగింపు ఘనంగా జరిగింది. గిరిజన మహిళలు సాంప్రద్రాయ ఏకరూప దుస్తులతో కొలాటం వేస్తూ ఊరేగింపు సాగింది. యువకులు కూడా కోలాటం, నృత్య కార్యక్రమాలను వేశారు. జడ్డంగి సాయిబాబా గుడి వద్ద ఏర్పాటు చేసి విగ్రహంను కూడా ఊరేగించారు. వారపుసంత లో భక్తులతో పండుగలా ఊరేగింపు జరిగింది.