గంగవరం: పాము అడ్డుగా రావడంతో ప్రమాదం

1116చూసినవారు
గంగవరం మండలం నెల్లిపూడి వద్ద గురువారం జాతీయ రహదారిపై పెద్ద పాము అడ్డుగా రావడంతో సామర్లకోటకు చెందిన రుద్రస్వామి అనే యువకుడు గాయపడ్డాడు. మొహనాపురం నుంచి సామర్లకోట వెళుతుండగా రోడ్డుపై పాము అడ్డు రావడంతో, భయపడి షడన్ బ్రేక్ వేయడంతో బైక్ పైనుంచి కిందపడ్డాడని స్థానికులు తెలిపారు. అటుగా వెళుతున్న 108 వాహనం సిబ్బంది అతడిని గంగవరం CHCకి తరలించారు.

సంబంధిత పోస్ట్