కూటమి సమన్వయంతోనే మంచి ఫలితాలు: ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

13చూసినవారు
కూటమి సమన్వయంతోనే మంచి ఫలితాలు: ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి
రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ, కూటమి పార్టీల మధ్య సమన్వయంతో మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన అరకు పార్లమెంట్ నియోజకవర్గ NDA కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో విస్తృతంగా చైతన్యం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, వంపూరి గంగులయ్య, కుడుపూడి సత్తిబాబు, దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్