చింతూరు మండలం తులసిపాక వద్ద బుధవారం గూడ్స్ లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. రాజమహేంద్రవరం నుంచి చింతూరు వైపు వెళ్తున్న లారీ (సీజీ 18ఎస్ 8034) వెనుక టైర్ల నుంచి నిప్పురవ్వలు రావడంతో మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.