అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం, చట్లవాడ గ్రామానికి చెందిన గొర్లె కరుణాకర్, తన సామాజిక సేవా దృక్పథంతో చేసిన సేవలకు గాను ప్రోబటిక్ బైబిల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డును ఆదివారం అందుకున్నారు. కరుణాకర్ తన వంతుగా వృద్ధులకు వస్త్రాలు, దుప్పట్లు, విద్యార్థులకు బట్టలు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.