పోలవరం జిల్లాలో 98 రహదారి పనులకు శంకుస్థాపన ఏర్పాట్లు

3చూసినవారు
పోలవరం జిల్లాలో 98 రహదారి పనులకు శంకుస్థాపన ఏర్పాట్లు
రంపచోడవరం పరిధిలో పల్లె పండగలో భాగంగా 98 సీసీ, బీటీ రహదారి పనులకు శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని డ్వామా పీడీ రాంప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన రాజవొమ్మంగి జి. రామ్. జి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. జిల్లాలో 1,071 ఎకరాల్లో జీడిమొక్కల సాగుకు 75,395 మొక్కలు, 950 ఎకరాల్లో 700 మంది రైతులకు 1.90 లక్షల జాప్రా మొక్కలు అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 77,055 జి. రామ్. జి కార్డులు, 1.30 లక్షల మంది వేతనదారులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లోకుల యాదగిరీశ్వరరావు, ఏపీఓ శ్రీనివాస్, హెచ్‌ఆర్‌ మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్