రంపచోడవరం ITDA PO స్మరణ్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో, మారేడుమిల్లి మండలంలో నీతి అయోగ్ పథకం కింద పనిచేయడానికి అస్పెరేషనల్ బ్లాక్ ఫెలో ఉద్యోగంపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ తాత్కాలిక నియామకం నెలకు రూ. 55 వేల జీతంతో ఉంటుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు డేటా అనలిస్ట్‌గా అనుభవం ఉన్నవారు ఫిబ్రవరి 9 లోపు ITDA కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.