పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని ASR/28 మద్యం దుకాణానికి లాటరీ ద్వారా లైసెన్స్ మంజూరు చేయనున్నట్లు జిల్లా ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై. శ్రీలత తెలిపారు. దరఖాస్తు రుసుము రూ. 3 లక్షలు, వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూ. 60. 50 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తులను అక్టోబర్ 1 మధ్యాహ్నం 12 గంటల వరకూ రంపచోడవరం ఎక్సజ్ కార్యాలయంలో ఇవ్వాలన్నారు. అక్టోబర్ 5 ఉదయం 8 గంటలకు పోలవరం పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ హాల్లో లాటరీ నిర్వహించనున్నట్లు చెప్పారు.