శరభవరంలో వర్మీ తయారీపై మండల స్థాయి శిక్షణ

4చూసినవారు
శరభవరంలో వర్మీ తయారీపై మండల స్థాయి శిక్షణ
రాజవొమ్మంగి మండలం శరభరం గ్రామ పంచాయతీలో మంగళవారం ఘన వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద వర్మీ తయారీపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ లోకుల యాదగిరేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులు పాల్గొన్నారు. తడిచెత్త సేకరణ, వర్మీ తయారీ విధానం, బిన్ బ్యాగుల వినియోగం, ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బిన్ బ్యాగుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్