కార్తీకమాసం ముగిసినప్పటికీ, రంపచోడవరం మండలంలోని రంప భూపతిపాలెం, సీతపల్లి, చాపరాయి ప్రాంతాలలో పర్యాటకుల సందడి భారీగా కొనసాగుతోంది. ఉదయం నుండి రంపచోడవరం పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలకు చేరుకున్న పర్యటకులు, ముఖ్యంగా రంప ప్రాంతాలలోని జలపాతాల వద్ద కోలాహలంగా స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. పర్యాటకుల తాకిడి గణనీయంగా ఉంది.