అడ్డతీగల మండల కేంద్రంలో శనివారం లయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోలవరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 48 మంది ఆదివాసీ కార్యకర్తలతో రాజ్యాంగ విలువలపై సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ విలువలను చెప్పడమే కాకుండా ఆచరించడం గొప్ప విషయమని ముఖ్యఅతిథి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. కార్యకర్తలు తెలిపిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, అడ్డతీగల జేఎఫ్‌సీఎం ఎం. మురళీ గంగాధరరావు, డాక్టర్ పల్లా త్రినాధరావు, లయ సంస్థ డైరెక్టర్ సిద్ధార్థ్ డిసోజా పాల్గొన్నారు.