రేపు మెగా జాబ్ మేళా: కలెక్టర్

535చూసినవారు
రేపు మెగా జాబ్ మేళా: కలెక్టర్
రంపచోడవరం ఐటీడీఏ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పోలవరం జిల్లా యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ జాబ్ మేళాలో 16 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. 10వ తరగతి, అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్