సిరిపురంలో పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

0చూసినవారు
సిరిపురంలో పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మారేడుమిల్లి మండలం దొరచింతలపాలెం పంచాయతీ సిరిపురం గ్రామంలో మంగళవారం రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి త్రాగునీటి పథకం ప్రారంభోత్సవం, పెన్షన్లను పంపిణీ చేసారు. ‘రెండేళ్ల నమ్మకం–ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలను వివరించి, అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గురుకు కుమార్, మల్లా దుర్గాప్రసాద్, ఫేక్ సుభాని, డాక్టర్ రాజకుమార్‌రెడ్డి, పాము రాంబాబు, కర్రీ సన్యాసిరెడ్డి, అందాల సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్