దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీ ఉప్పయపాలెంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి సర్వస్వం కోల్పోయిన మడకం చిన్నమ్మిని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి శనివారం పరామర్శించారు. బాధితురాలికి రూ. 5 వేల ఆర్థిక సాయంతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులు అందించారు. నష్టపరిహారం కోసం నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.