రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సోమవారం రాజవొమ్మంగి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జడ్డంగి జెడ్పీ ఉన్నత పాఠశాల, రేవటిపాలెం గిరిజన ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.30 గంటలకు శివ కామాక్షి గోవింద ఫంక్షన్హాల్లో జరిగే మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులు కోట్ని బాలాజీ, కుడుపూడి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్, వంతల రాజేశ్వరి హాజరవుతారని క్యాంపు సిబ్బంది తెలిపారు.