
నేడు ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తన్న పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఇవాళ అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. రూ.2,000 సాయాన్ని నవంబర్ 19 విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ విడతతో కోట్లాది మంది రైతులకు నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారా లబ్ధి చేరనుంది. ఇప్పటివరకు 20 విడతల్లో 11 కోట్లకు పైగా కుటుంబాలకు రూ.3.70 లక్షల కోట్లు జమయ్యాయి. అయితే ఈ పథకం కింద డబ్బులు రావాలంటే భూమి వివరాలు, ఆధార్-బ్యాంక్ లింక్ తప్పనిసరి.




