అడ్డతీగల మండలం చేనుపాకల గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపల్లి నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా అడ్డు వచ్చిన గేదెను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న కుంజం అర్జున్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో గేదె అక్కడికక్కడే మరణించింది. స్థానికులు వెంటనే స్పందించి అర్జున్‌ను అడ్డతీగల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.