భారీ వర్షాలతో పాములమామిడి గ్రామం అతలాకుతలం

2చూసినవారు
భారీ వర్షాలతో పాములమామిడి గ్రామం అతలాకుతలం
మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయితీలోని పాములమామిడి గ్రామంలో గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా చెట్లు, కొండ చరియలు రోడ్లపై పడిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు కూడా ధ్వంసమై, మధ్యలోకి విడిపోయి ప్రయాణికులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు కూడా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి గ్రామాన్ని ఆదుకోవాలని పాములమామిడి గ్రామస్తులు సాధల సుబ్బారెడ్డి, పండు రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్