రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం వంతెన సమీపంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలు సమయంలో జె. అన్నవరం స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కకు పోయింది. ఏలేశ్వరం మండలం జె. అన్నవరం నుండి రాజవొమ్మంగి మండలానికి స్కూల్ విద్యార్దులను తీసుకొని వస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న మోటార్ బైక్ ను తప్పించే ప్రయత్నం ప్రమాదం జరిగింది. ప్రయాణ సమయంలో బస్సు లో 30 మంది
విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.