రాజవొమ్మంగిలో రూ.3.5 కోట్లతో నిర్మించిన రోడ్డు వారానికే గడ్డి మొలచి, ఊడిపోతోంది. నాణ్యత లోటుగా ఉండటంతో రహదారి పై పొర వస్తుందని, అధికారుల నిర్లక్ష్యం కారణమని గ్రామస్తులు వాపోయారు. ముంజవరప్పాడు-కిండ్ర కాలనీ వరకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. అధికారులు వెంటనే చొరవ చూపాలని స్థానికులు తెలిపారు.