రంప: కలెక్టర్ ఆదేశాలతో ఇంటికి వచ్చిన గ్యాస్

0చూసినవారు
రంప: కలెక్టర్ ఆదేశాలతో ఇంటికి వచ్చిన గ్యాస్
రంపచోడవరం మండలం ఐ.పోలవరం గ్రామంలో గంగమ్మ అనే వృద్ధురాలు పింఛన్లు పంపిణీకి వచ్చిన కలెక్టర్ దినేశ్ కుమార్‌కు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం సాయంత్రంలోగా ఆమె ఇంటికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను డోర్ డెలివరీ చేశారు. అధికారులు అందించిన సత్వర సాయానికి గంగమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్