రంపచోడవరం మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. ఎంపీపీ పాఠశాల ఆవరణలో సంచరిస్తున్న కుక్క శనివారం మధ్యాహ్నం వరకు ఐదుగురిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడిన వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. పాఠశాల పరిసరాల్లో పిచ్చికుక్క సంచారం కొనసాగుతుండటంతో విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.