పోలవరం జిల్లాలో మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి అధికారులు చర్యలు చేపట్టారు. 867 సంఘాల్లోని 7, 798 మంది సభ్యులకు ఇప్పటికే రూ. 75 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు జిల్లా పి. డి. రత్నాకర్ రావు మంగళవారం తెలిపారు. మరోవైపు 10 వేల మంది రైతులతో 5 వేల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నూతన పెన్షన్ల కోసం వచ్చిన 11, 606 దరఖాస్తుల్లో 10, 464 దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారులకు పంపారు. జిల్లాలోని 46, 360 మంది పెన్షన్దారులకు రూ. 19. 40 కోట్లను అక్టోబర్ 1న పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.