గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి

0చూసినవారు
గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి
తుఫాన్ వర్షాలతో గ్రామాల్లో నిలిచిన మురుగునీటిని తొలగించి పారిశుధ్య పనులు చేపట్టాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో మురుగునీటి నిల్వలతో దోమలు, పాముల సంచారం పెరిగి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందన్నారు. ఎన్నికల కోడ్ పారిశుధ్య పనులకు అడ్డంకి కాకూడదని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో తక్షణమే శానిటేషన్ పనులు చేపట్టాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్