రంప: పాఠశాలలో ఆడుకుంటు.. కుప్పకూలిన విద్యార్థిని

790చూసినవారు
రంప: పాఠశాలలో ఆడుకుంటు.. కుప్పకూలిన విద్యార్థిని
రంపచోడవరం మండలం తామరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం 4వ తరగతి విద్యార్థిని కె. జానుశ్రీ తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా ఫిట్స్ వచ్చి పడిపోయింది. వెంటనే ఆమెను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్