జాతీయ రహదారిపై గేదెను ఢీకొని వ్యక్తి మృతి

245చూసినవారు
జాతీయ రహదారిపై గేదెను ఢీకొని వ్యక్తి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం మిరియాలవీధిలో జాతీయ రహదారి 516ఇపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతంశెట్టి మురళీమోహన్ రెడ్డి (56) అనే వ్యక్తి మృతి చెందారు. అడ్డతీగల నుంచి జడ్డంగి వైపు స్కూటీపై వెళ్తున్న ఆయన, రోడ్డుపై అకస్మాత్తుగా వచ్చిన గేదెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలం నుండి అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్ ప్రసన్న తెలిపారు.
Job Suitcase

Jobs near you