జడ్డంగి పీఎస్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

886చూసినవారు
జడ్డంగి పీఎస్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
పోలవరం జిల్లా నూతన ఎస్పీ చక్రవర్తి మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం పరిధిలో గల జడ్డంగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, రికార్డులను పరిశీలించి కేసుల పురోగతిని సమీక్షించారు. ఆపరేషన్ త్రిసూల్ లక్ష్యమని తెలిపారు. ఈ తనిఖీలో సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ చినబాబు, ఏఎస్ఐ సురేష్, శాస్త్రి, సుబ్బారావు, ప్రసాద్ రెడ్డి, శ్రీను, సురేష్, లింగేశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్