అధికారులతో రివ్యూ నిర్వహించిన ఎస్టీ చైర్మన్ బొజ్జి రెడ్డి

526చూసినవారు
అధికారులతో రివ్యూ నిర్వహించిన ఎస్టీ చైర్మన్ బొజ్జి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జి రెడ్డి బుధవారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. గ్రామ సచివాలయాల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, విద్య, వైద్యం, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్టీ కమిషన్ సభ్యులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్