పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి శనివారం రంపచోడవరంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి మధ్యాహ్నం 12 గంటలైనా అధికారులు హాజరు కాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని అధికారులు ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నిస్తూ, అధికారుల తీరుపై ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.