సంక్రాంతి పండుగల సందర్భంగా చింతూరు డివిజన్ పరిధిలో కోడి పందాలు నిర్వహించడం, ఏర్పాటు చేయడం, అనుమతించడం పూర్తిగా నిషేధమని ఐటీడీఏ చింతూరు ప్రాజెక్టు అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జంతు క్రూరత్వ నిరోధక చట్టం–1960 ప్రకారం కోడి పందాలు నేరమని, అక్రమంగా నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పందాల నిర్వహణకు సంబంధించి స్థలాలు, ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ విభాగాలను ఉపయోగించరాదని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.