రాజవొమ్మంగిలో టీడీపీ భారీ ర్యాలీ

1చూసినవారు
రాజవొమ్మంగిలో టీడీపీ భారీ ర్యాలీ
రాజవొమ్మంగి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం టీడీపీ భారీ ర్యాలీ జరిగింది. జడ్డంగిలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ జడ్పీటీసీ అభ్యర్థి ఎం. విజయ్ భాస్కర్, ఎంపీటీసీ అభ్యర్థి వి. నీలిమ గంగాధర్‌లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాజవొమ్మంగిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థులు కోమలిదేవి, సుబ్బలక్ష్మిలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో మండల టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, శివరామచంద్రరాజు, తాతారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్