చీపురు పట్టిన ఎమ్మెల్యే

1చూసినవారు
చీపురు పట్టిన ఎమ్మెల్యే
స్వచ్ఛత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. గురువారం మారేడుమిల్లిలో నిర్వహించిన స్వచ్ఛ పక్వాడ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ చక్రవర్తి, డి ఎస్పీ ఆశ్రఫ్ ఆలీ పర్యవేక్షణలో సి. ఆర్ పి. ఎఫ్ సి. ఐ. చెలముత్తు, మారేడుమిల్లి సి. ఐ. బి. నరసింహమూర్తి, ఎస్. ఐ. కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్