ఎస్సీ వర్గీకరణ వెనుక రాజకీయ కుట్ర జరగుతుంది

554చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాల మహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశంలోని 1,108 ఎస్సీ కులాలకు, తెలుగు రాష్ట్రాల్లోని 59 ఉపకులాలకు సమాన న్యాయం ఎలా జరుగుతుందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని బుధవారం డిమాండ్ చేశారు. వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శిస్తూ, మాలల హక్కుల పరిరక్షణ కోసం నాయకులు, ఉద్యోగులు శాంతియుత ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధం కావాలని ఆర్.ఎస్. రత్నాకర్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్