ఎన్నికల సిబ్బందికి రవాణా కష్టాలు.. బస్సుల కోసం నిరీక్షణ

8చూసినవారు
ఎన్నికల సిబ్బందికి రవాణా కష్టాలు.. బస్సుల కోసం నిరీక్షణ
రంపచోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం ఎన్నికల విధులకు రాజవొమ్మంగి వెళ్లేందుకు సిబ్బంది బస్సు కోసం ఎదురుచూశారు. రంపచోడవరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని రాజవొమ్మంగి మండల కేంద్రానికి చేరుకుని, అక్కడి నుంచి 42 పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంది. మారుమూల గ్రామాల్లో పోలింగ్‌కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. లోదొడ్డి, తాళ్లపాలెం, చీడిపాలెం, బలిజిపాడు గ్రామాలకు మండల కేంద్రం నుంచి మరో 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండటంతో సిబ్బంది ఆందోళన చెందారు.

సంబంధిత పోస్ట్