విద్యుత్ లైన్ పై చెట్టు పడి 40 గ్రామాలకు అంతరాయం

13చూసినవారు
విద్యుత్ లైన్ పై చెట్టు పడి 40 గ్రామాలకు అంతరాయం
రాజవొమ్మంగి మండలంలో ఎడతెరుపు లేని వర్షాల వల్ల జడ్డంగి గ్రామ శివారున బుధవారం సాయంత్రం 11 కె. వి. విధ్యుత్ లైన్ పై చింత చెట్టు పడటం వల్ల ఆరు విద్యుత్ స్తంబాలు పడిపోయాయని ఇన్ చార్జి ఏ. ఈ. కొంగర అబ్బాయిదొర తెలిపారు. దీనివల్ల జడ్డంగి, చేరుకుంపాలెం, అమినాబాద్, వాతంగి, లోదొడ్డి, చికిలింత, వంచంగి, మారేడుబాక పంచాయితీల్లో 40 గిరిజన గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్దరణ సమయం పడుతాదన్నారు.

సంబంధిత పోస్ట్