కత్తి పీటతో పీక కోసుకొన్న గిరిజన యువకుడు

5చూసినవారు
కత్తి పీటతో పీక కోసుకొన్న గిరిజన యువకుడు
రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెం పంచాయితీ పాత వెలగలపాలెం గ్రామానికి చెందిన సోముల మురళీ (29) అనే గిరిజన యువకుడు మధ్యానికి బానిసై ఒక్కసారిగా మాని వేయడంతో మతి స్థిమితం లేక ఆదివారం ఉదయం ఇంటి వద్దే కత్తిపీటతో పీకను కోసుకొన్నాడు. తల్లిని ఇంటిలో పెట్టి తలుపు వేసి ఈ సంఘటనకు పాల్పడ్డాడు. మురళికి వివాహం కాలేదు. తండ్రి చనిపోగా తల్లి రాజులమ్మ వద్ద ఉంటున్నాడు. అతన్ని జడ్డంగి పి. హెచ్. సి కి తరలించారు. స్థాప్ నర్స్ నాగలక్ష్మి ప్రాథమిక చికిత్స చేసి ఏలేశ్వరం రిఫర్ చేశారు. పైలట్ గవర్రాజు, ఇ. యం. టి. అశోక్ పర్యవేక్షణలో తరలించారు.

సంబంధిత పోస్ట్