రాజవొమ్మంగి మండలం దూసరిపాము ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు పరిషిక వెంకటేశ్వర్లు డయాలాసిస్ తో బాధపడుతుండటంతో యూటీఎఫ్ సభ్యులు సేకరించిన రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ఎంఈఓ తూము సూరయ్యరెడ్డి, గొలగాని శ్రీనివాస్, కానెం శ్రీనివాస్ లు సోమవారం అందజేశారు. సభ్యులకు అవసరమైన సమయంలో యూటీఎఫ్ అండగా ఉంటుందని మండల ప్రధాన కార్యదర్శి కానెం శ్రీను తెలిపారు. గొలగాని శ్రీను, తీగల బొజ్జియ్య, బీరబోయిన వెంకటలక్ష్మి, పొట్టబోయిన రమణ, కోడూరి లోవరాజు, మిరియాల రమేష్‌బాబు, మిరియాల సత్యవతి, టి. వి. ఎల్. ప్రసన్న, చిన్నంశెట్టి చిట్టిబాబు, కోపూరి రమేష్ పాల్గొన్నారు.