రంపచోడవరం మండలం చిన గెద్దాడ గ్రామంలో గురువారం MGNRGS పథకం పేరు మార్పు కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి జ్యోతి ప్రజ్వలన చేశారు. నూతన పథకం VBRA MG లో 125 రోజులు పని దినాలు, దినసరి వేతనం రూ. 312 ఉంటుందని, 318 రకాల పనులు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ ప్రశాంత్ కుమార్, ఎస్టీ కమీషన్ చైర్మన్ సొళ్ల బొజ్జిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.