రాజవొమ్మంగి మండలానికి చెందిన డిగ్రీ
విద్యార్థులు సిద్దు, పృథ్వీరాజ్‌కు రాజమహేంద్రవరం బీసీ హాస్టల్‌లో సీట్లు లభించకపోవడంతో, వీరమహిళ విశాలాక్షి వారి సమస్యను శుక్రవారం మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సహాయంతో విద్యార్థులకు హాస్టల్ సీట్లు కేటాయించేలా విశాలాక్షి చొరవ చూపారు. విద్యార్థుల సమస్య పరిష్కారానికి ఆమె చేసిన కృషిని దినేష్‌తో పాటు పలువురు అభినందించారు.