దేవిపట్నం మండలం పరగసానిపాడు గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాజు అనే యువకుడు బ్యాటింగ్ చేసి అవుట్ అయిన తర్వాత, మంచినీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో గ్రామం విషాదంలో మునిగిపోయింది.