
విశాఖ: ఆ దరఖాస్తులకు ఆహ్వానం
విశాఖలోని 12 రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శనివారం తెలిపారు. డిసెంబర్ 31తో ఖాళీ కానున్న 25 డ్వాక్రా మహిళల స్టాల్స్, అలాగే ఆరు PHC స్టాల్స్ కోసం డిసెంబర్ 7 నుంచి 17 వరకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. దరఖాస్తులను గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.








































